బాన్సువాడ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి
నవతెలంగాణ – బాన్సువాడ (నసురుల్లాబాద్)
ఓటు హక్కు సద్వినియోగంతోనే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని బాన్సువాడ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి స్పష్టం చేశారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం కోసం ఓటు’ అనే నినాదంతో ఆదివారం బాన్సువాడ పట్టణంలో సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి బస్ స్టాండ్ వరకు అధికారులు, సిబ్బందితో జాతీయ ఓటరు దినోత్సవ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ వద్ద మానవహారం కార్యక్రమం నిర్వహించారు.అలాగే సబ్ కలెక్టర్ అందరితో ఓటర్ల ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ అర్హులైన యువత ఓటరుగా తప్పకుండా నమోదు చేసుకోవాలని సూచించారు. స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది వంటిదని. ప్రజలు తమ ఓటు హక్కులను వినియోగించుకొని, తమ ప్రతినిధులను ఎంచుకోవడానికి ఓటు హక్కు ఎంతో సహాయపడుతుందన్నారు. ఓటు హక్కు ప్రజలందరికీ సమానంగా ఉంటుందని, ఓటుకు కులం, మతం, లేదా ఆర్థిక స్థితితో సంబంధం లేదన్నారు. ఓటు హక్కు లేని వారందరూ తప్పక ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



