Sunday, March 15, 2026
E-PAPER
Homeఖమ్మంఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ వ్యవస్థ బలోపేతం

ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ వ్యవస్థ బలోపేతం

- Advertisement -

– వినాయకపురం సబ్ స్టేషన్ ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యం పెంపు
– కావడిగుండ్లకు కొత్త 33 కెవి లైన్ ప్రారంభించిన ఎస్ఈ మహేందర్
నవతెలంగాణ – అశ్వారావుపేట 

రానున్న ఎండాకాలంలో విద్యుత్ వినియోగం పెరగనున్న నేపథ్యంలో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు వినాయకపురం 33/11 కెవి సబ్‌స్టేషన్‌లో ఉన్న పవర్ ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యాన్ని 3.15 ఎంవిఏ నుండి 5 ఎంవిఏకు పెంచడం జరిగిందని ఎన్పీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ మహేందర్ అన్నారు. ఆదివారం మండలంలో పర్యటించిన ఆయన కొత్తగా నిర్మించిన కవడిగుండ్ల 33/11 కెవి సబ్‌స్టేషన్‌కు 17 కిలోమీటర్ల 33 కెవి లైన్ నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రారంభించారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ పనుల వల్ల పరిసర ప్రాంతాల్లో వోల్టేజ్ సమస్యలు తగ్గి వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా అందనుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ పాల్వంచ డివిజన్ (ఆపరేషన్) డీఈ నందయ్య,కన్స్ట్రక్షన్ డీఈ వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట సబ్ డివిజన్ ఆపరేషన్ ఏడీఈ బి.వెంకటరత్నం, ఏడీఈలు రాంబాబు,మధు, ఏఈ లు విజయ్ కృష్ణ,నరసింహారావు ఓ అండ్ ఎం సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -