Monday, December 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఒత్తిడిని తగ్గించే ఫ్రెండ్లీ సినిమా థియేటర్లు

ఒత్తిడిని తగ్గించే ఫ్రెండ్లీ సినిమా థియేటర్లు

- Advertisement -

సాంప్రదాయ థియేటర్‌ నియమాల వల్ల వచ్చే ఒత్తిడిని తగ్గించడమే కాకుండా శబ్దం, వెలుతురు, జనసమూహం ఎక్కువగా ఉండటం వల్ల గందరగోళానికి గురయ్యే మనసును తేలిక పరిచే ఫ్రెండ్లీ సినిమా థియేటర్లు ‘ఏడిహెచ్‌డి’ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా నెదర్‌లాండ్స్‌లో తొలిసారి ఈ థియేటర్లను ప్రారంభించారు. తమకి ఇష్టమైన వారితో, స్నేహితులతో, కుటుంబ సభ్యులతో సిల్వర్‌స్క్రీన్‌ మ్యాజిక్‌ను ఆస్వాదించేలా ఈ థియేటర్లను రూపొందించారు. అంతేకాదు ఏడీహెచ్‌డి ఉన్నవారిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా దీన్ని రూపకల్పన చేశారు. ఇది థియేటర్ల చరిత్రలోనే ఒక గేమ్‌ ఛేంజర్‌. నిశ్శబ్దం, కదలకుండా కూర్చోవడం వంటి వాటికి భిన్నంగా అల్లికలు, డ్రాయింగ్‌, పజిల్స్‌ చేయడానికి ల్యాంపులతో ఉన్న డెస్కులు, లేచి నిలబడటానికి, చుట్టూ నడవడానికి పూర్తి స్వేచ్ఛ ఉండటమే ఈ థియేటర్ల ప్రత్యేకత. మీ మనసు ఎలా కోరుకుంటుందో అలా సినిమాను ఆస్వాదించవచ్చు. అది కూడా పెద్ద తెర అనుభవంతో. ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ మన ఇంట్లో మల్టీటాస్కింగ్‌కు అలవాటు చేసింది. ఇప్పుడు సినిమా థియేటర్లు కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -