– అటవీ రేంజ్ అధికారి రవీందర్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
కమ్మర్ పల్లి అటవీ రేంజ్ పరిధిలో అనుమతులు లేకుండా అక్రమంగా చెట్లను కొడితే కఠిన చర్యలు తప్పవని అటవీ రేంజ్ అధికారి రవీందర్ హెచ్చరించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం రాత్రి కమ్మర్ పల్లి గ్రామానికి వేప చెట్లను తరలిస్తుండగా కన్సర్న్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్ ట్రాక్టర్‌ను పట్టుకున్నారు. ఈ విషయమై సోమవారం ఆయన అటవీ రేంజ్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ఆయన వివరాలను వెల్లడించారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం ఆరపేట గ్రామానికి చెందిన పతంగి సంపత్ గౌడ్ ట్రాక్టర్ లో వేప కట్టెను అక్రమంగా తరలిస్తున్న తరలిస్తున్నారు అన్న విశ్వాసనీయ సమాచారం మేరకు అటవీ రేంజ్ సిబ్బంది పట్టుకున్నట్లు ఆయన తెలిపారు.
ఒక ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని అటవీ రేంజ్ ఆఫీస్ కాంప్లెక్స్‌లో ఉంచి, అతనిపై కేసు నమోదు చేసినట్లు అటవీ రేంజ్ అధికారి రవీందర్ తెలిపారు. ఇలాంటి కార్యకలాపాలలో ఇతరులు ఎవరైనా పాల్గొంటే వారిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా వేప కట్టెను అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు పట్టుకోగా పత్రికలకు మాత్రం ఒక్క ట్రాక్టర్ పట్టుకున్నట్లు రేంజ్ అధికారి వెల్లడించారు.కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారి శ్రీనివాస్, ఫారెస్ట్ బీట్ అధికారి వరుణ్ పాల్గొన్నారు.



