Saturday, January 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిబంధనలు పాటించని వాహనదారులపై కఠిన చర్యలు

నిబంధనలు పాటించని వాహనదారులపై కఠిన చర్యలు

- Advertisement -

మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాహుల్ కుమార్ 
నవతెలంగాణ – ఆర్మూర్ 

నిబంధనలు పాటించని వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్  ఏనగండ్ల రాహుల్ కుమార్ హెచ్చరించారు. మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ బైపాస్ వద్ద, ఆటో స్టాండు వద్ద శనివారం వాహన తనిఖీలు ముమ్మరం చేసినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రోడ్డు భద్రత నిబంధనలు పాటించి వాహనాలను నడిపితే ప్రమాదాలు జరగకుండా దూరంగా ఉండవచ్చని అన్నారు. రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ శాతం సరైన అవగాహన లేకుండా, ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడంతో జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ,సీట్ బెల్ట్ ధరించాలని , త్రిబుల్ రైడింగ్ చేయవద్దని, మద్యం సేవించి, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. ఆటో డ్రైవర్లకు కరపత్రాలను అందజేసి అవగాహన సైతం కల్పించినారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -