నవతెలంగాణ – తాంసి
నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తాంసి బింపూర్ ఎస్సై జీవన్ రెడ్డి. విక్రమ్ అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా మద్యం సేవించి వాహనాలతో పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అదేశంలో బుధవారం రోజున ఆయా మండలాల్లోని జాతీయ అంతర్జాతీయ రహదారులపై పోలీస్ సిబ్బందితో కలిసి ఉదయం నుండి స్పెషల్ డ్రైవ్ వాహన తనిఖీలతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతు నూతన సంవత్సరంతో పాటు అన్ని పండుగలు సంతోషంగా జరుపుకోవాలని మద్యం సేవించి వాహనాలు నడపడం అనుకోకుండా ప్రమాదాలు జరిగితే ఆ వ్యక్తిపై ఆధారపడి ఉన్న కుటుంబం పూర్తిగా చిన్న భిన్నమై పోతుంది ఒక్కసారి తమ కుటుంబాన్ని గుర్తు చేసుకొని మద్యం సేవించడం మాని మద్యం సేవించి వాహనాలు నడపడం మానుకోవాలని ముఖ్యంగా యువకులు మద్యం సేవించి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం వాహనాలు సీజ్ చేయడం లైసెన్సులను రద్దు చేయడంతో పాటు కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.
మద్యం చేవించి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



