Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు 

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు 

- Advertisement -

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ 

నవతెలంగాణ-భూపాలపల్లి

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరించారు. శుక్రవారం ఐ డి ఓ సి కార్యాలయంలో  లింగ నిర్ధారణ పరీక్షలపై ఫిర్యాదు చేసేందుకు వాట్స్అప్ నెంబర్ ముద్రించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…. పుట్టబోయే బిడ్డ ఆడ మగ అని చెప్పడం చట్టరీత్యా నిషేధమన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అలాంటి సమాచారం ఏదైనా తెలిస్తే 630 323 9891 నెంబర్ కు వాట్సప్ చేయాలని కోరారు. అలాగే 104 181, 1098, 100 టోల్ ఫ్రీ నెంబర్లకు, email ID PC pndtcomplaintdmhoJayashankar @gmail.com కి కూడా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్,  జిల్లా మాత శిశు సంక్షేమ ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీదేవి, పిఓ డాక్టర్ ఉమాదేవి మాస్ మీడియా అధికారి శ్రీదేవి పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad