– కమ్మర్ పల్లి అటవీ రేంజ్ అధికారి రవీందర్ నాయక్
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
కమ్మర్పల్లి ఆటో రేంజ్ పరిధిలో ఎవరైనా అక్రమంగా చెట్లను నరికితే కఠిన చర్యలు తప్పవని అటవీ రేంజ్ అధికారి రవీందర్ నాయక్ హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం మండలంలోని కోన సముందర్ లో అటవీ ప్రాంతంలో చెట్లను కొడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు డిప్యూటీ రేంజ్ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది గాలింపు చేపట్టారు. గ్రామ శివారు అటవీ ప్రాంతంలో చెట్లను నరికివేస్తుండగా దండ్ల లింబాద్రి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
అతని వద్ద నుండి ఒక ద్విచక్ర వాహనం, ఒక చెట్టు కోసే యంత్రాన్ని స్వాధీనం చేసుకుని కమ్మర్ పల్లి అటవీ రేంజ్ కార్యాలయానికి తరలించారు. అక్రమంగా చెట్ల నరుకుతూ పట్టుబడ్డ లింబాద్రి గతంలో కూడా ఇదేవిధంగా దొరికినట్లు తెలిపారు. అలవాటు పడిన నేరస్థుడన్నారు. ఈ సందర్భంగా అటవీ రేంజ్ అధికారి రవీందర్ నాయక్ మాట్లాడుతూ అటవీ భూమిలో చెట్లను కొట్టడం, అక్రమంగా కలపను తరలించడం లాంటి కార్యకలాపాలలో ఇతరులు ఎవరైనా పాల్గొంటే వారిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటవీ రేంజ్ పరిధిలో అక్రమంగా చెట్లను కొట్టడం, తరలించడం చట్టరీత్య నేరమన్నారు.
అక్రమంగా చెట్లను నరికితే కఠిన చర్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES