– అధికారులకు మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశం
– తనిఖీ, నియంత్రణ కోసం కమిటీ ఏర్పాటు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సంతానం కోసం తపిస్తున్న దంపతుల ఆశను ఆసరాగా చేసుకుని, ఐవీఎఫ్, సరోగసిని వ్యాపారంగా మార్చి దందాకు పాల్పడుతున్న ఐవీఎఫ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నతాధికారులను ఆదేశించారు. సష్టి తరహా ఘటనలు పునరావృతం అవకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐవీఎఫ్ క్లినిక్‌లలో తనిఖీలు, నియంత్రణ కోసం ఉన్నతాధికారులతో కమిటీని నియమించాలని వైద్యారోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టీనా జెడ్ చొంగ్తూకు మంత్రి సూచించారు. ఈ మేరకు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ నేతృత్వంలో ఆరోగ్యశ్రీ సీఈవో, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సభ్యులుగా కమిటినీ నియమిస్తూ సెక్రెటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ ప్రయివేటు ఐవీఎఫ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించనున్నారు. ఆయా సెంటర్లపై ఇదివరకే నమోదైన కేసుల వివరాలు సేకరించనున్నారు. ఆయా సెంటర్ల అనుమతులు, రిజిస్ట్రేషన్ల వ్యాలిడిటీ వంటి అంశాలను పరిశీలించనున్నారు. ఈ ప్రక్రియను పది రోజుల్లో పూర్తి చేసి, నివేదిక అందించాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.
ఐవీఎఫ్, సరోగసీ దందాపై కఠిన చర్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES