- Advertisement -
నిజాంసాగర్ ఎస్సై శివకుమార్
నవతెలంగాణ – నిజాంసాగర్
చైనా మాంజ మండలంలో ఎవరైనా విక్రయిస్తే చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని నిజాంసాగర్ ఎస్ఐ శివకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మహ్మద్ నగర్, నిజాంసాగర్ మండలంలో శుక్రవారం వివిధ షాప్ లలో గాలిపటాలు, వాటి ధారలు విక్రయాలను ఆయన తనికి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోవు సంక్రాంతి పండగ వేళా చైనా మంజా ఎవరు అమ్మకూడదని దాని వలన మనుషులకు, జంతువుల ప్రాణాలకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని ఆయన అన్నారు. నిబంధనలను కాదని ఎవరైనా చైనా మంజా అమ్మినట్లయుతే నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలి అని ఆయన కోరారు. సమాచారం అందించిన వారి పేర్లను గుప్తంగా ఉంచుతామని ఎస్సై తెలిపారు.
- Advertisement -



