- Advertisement -
- – రికార్డులు పరిశీలిస్తున్న తహసీల్దార్
నవతెలంగాణ-పెద్దవూర
నకిలీ విత్తనాలు, ఎరువులు, మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మండల తహసీల్దార్ శ్రీనివాసులు హెచ్చరించారు. మంగళవారం మండలకేంద్రం లోని పర్టి లైజర్స్,
ఎరువులు, పురుగుల మందు, విత్తనాలు అమ్మే డీలర్ల శాపులను మండల వ్యవసాయాధికారి సందీప్ రెడ్డి తో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈసందర్బంగా రికార్డులస్టాక్,
ఎరవులు, విత్తనాలు, పురుగు మందుల ను పరిశీలించి మాట్లాడుతూ.. ఖరీఫ్‌లో ఎటువంటి నకిలీ విత్తనాలు, ఎరువులు, నకిలీ పురుగు మందులు విక్రయించడానికి వీల్లేదని, అటువంటి వారిపై పూర్తిగా నిఘా ఉంచామని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సరైన ధరలకు సరైన మందుల ను, ఎరువులను విత్తనాలను విక్రయించాలన్నారు. డీలర్లందరూ విత్తనాలు అమ్మిన రైతులకి రశీదు తప్పకుండా ఇవ్వాలన్నారు. నాణ్యమైన విత్తనాలను మాత్రమే అమ్మాలని సూచించారు. అధిక ధరలకు విత్తనాలను అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు.లేనిపక్షంలో చట్టపర మైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈయన వెంట ఆర్ఐ దండ శ్రీనివాసరెడ్డి,డీలర్లు తదితరులు ఉన్నారు.
- Advertisement -