భావన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గంధం మదన్
నవతెలంగాణ – వనపర్తి
1996లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వెల్ఫేర్ బోర్డు చట్టం నిబంధనలను ధిక్కరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని భావన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గంధం మదన్ డిమాండ్ చేశారు. శుక్రవారం వనపర్తి పట్టణంలోని కార్మికుల అడ్డాల దగ్గర కార్మికుల ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వెల్ఫేర్ బోర్డుల నిధులు దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేపట్టాలని, వెల్ఫేర్ బోర్డు నిధులు కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 60 సంవత్సరాలు వయసు పైబడిన కార్మికునికి రూ.10000 నెలకు పెన్షన్ వెల్ఫేర్ బోర్డు ద్వారానే ఇవ్వాలన్నారు. కార్మికునికి ఇల్లు లేని వారికి గృహ వసతి కల్పించాలన్నారు. సహజ మరణానికి ఐదు లక్షల పెంచాలని, పెండింగ్ లో ఉన్న లేబర్ కార్డులను వెంటనే రెన్యువల్ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. వెల్ఫేర్ బోర్డు ద్వారా ప్రైవేట్ భీమ కంపెనీలైన సంస్థలకు రూ.346 కోట్లు దారి మళ్లించడం ద్వారా కార్మికులు తీవ్ర నష్టానికి గురవుతారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు డి కురుమన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నిక్సన్, బాలస్వామి, టౌన్ కార్యదర్శి రాబర్ట్, జిల్లా సహాయ కార్యదర్శి రవి, కురుమన్న తదితరులు పాల్గొన్నారు.
వెల్ఫేర్ బోర్డు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



