- Advertisement -
నవతెలంగాణ – కట్టంగూరు
ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ ఏ పుష్పలత అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ లో 482 సర్వే నెంబర్ లో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు ఆరోపణలు రావడంతో సోమవారం సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె సర్వేను పరిశీలించి మాట్లాడారు. సర్వే రిపోర్టు వచ్చిన తర్వాత ఆక్రమణ నిజమైన తేలితే ప్రభుత్వభూమిని స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. ఈ సర్వేలో మండల ఆర్ ఐ జీవీఎస్ రామారావు, డిఐ పవన్, మండల సర్వేయర మధు, జిపిఓ మహమ్మద్ అల్లావుద్దీన్ ఉన్నారు.
- Advertisement -



