నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ కళాభారతి(ఎన్టీఆర్ స్టేడియం)లో వాహనాలను అక్రమంగా పార్కింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ముషీరాబాద్ సర్కిల్ 15 డిప్యూటీ కమిషనర్ రామానుజలరెడ్డి హెచ్చరించారు. ఎన్టీఆర్ స్టేడియంలో వాహనాల అక్రమ పార్కింగ్‌పై అధికారులు చర్యలు చేపట్టారు. ముషీరాబాద్ సర్కిల్ 15 డిప్యూటీ కమిషనర్ రామానుజలరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ట్రాఫిక్ పోలీసులతో కలసి ఎన్టీఆర్ స్టేడియంలో అక్రమంగా పార్కింగ్ చేసిన వాహనాలను తొలగించారు. క్రేన్ సహాయంతో ఒక్కో వాహనాన్ని అక్కడి నుంచి తరలించారు. అనంతరం ముషీరాబాద్ సర్కిల్ 15 డిప్యూటీ కమిషనర్ రామానుజలరెడ్డి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ స్టేడియంలో వాహనాల అక్రమ పార్కింగ్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక ముందు వాహనాలను ఎన్టీఆర్ స్టేడియంలో పెడితే వాటిని సీజ్ చేసి, వేలంపాట వేస్తామని తెలిపారు. స్టేడియంలో పారిశుద్ధ్య నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన స్టేడియంలో చెత్తా చెదారం వేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్టేడియంలో పేరుకుపోయిన చెత్త, మట్టి కుప్పలను వెంటనే తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు.
ఎన్టీఆర్ స్టేడియంలో అక్రమ పార్కింగ్ చేస్తే కఠిన చర్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES