Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్యూరియాను అక్రమంగా నిలువ చేస్తే కఠిన చర్యలు

యూరియాను అక్రమంగా నిలువ చేస్తే కఠిన చర్యలు

- Advertisement -

మండల వ్యవసాయ శాఖ అధికారి శరత్ చంద్ర 
ఎరువుల దుకాణాల గోదాముల తనిఖీ 
నవతెలంగాణ – పాలకుర్తి

యూరియాను రైతులకు అందించకుండా గోదాముల్లో అక్రమంగా నిలువ చేస్తే చర్యలు తప్పవని వ్యవసాయ శాఖ మండల అధికారి రేపాల శరత్ చంద్ర ఎరువుల దుకాణాల నిర్వాహకులను హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రంలో గల వివిధ ఎరువుల దుకాణాల గోదాములను రైతులతో కలిసి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏవో శరత్ చంద్ర మాట్లాడుతూ యూరియా కొరత ఉన్నప్పటికీ గోదాముల్లో యూరియా నిల్వలు ఉన్నాయని రైతులు అనుమానాలు వ్యక్తం చేశారని తెలిపారు. రైతుల అనుమానాలను తొలగించేందుకు గోదాములను తనిఖీ చేసి యూరియా బస్తాల నిలువల పట్ల ఆరా తీశామని తెలిపారు. చినిగిన యూరియా బస్తాలు ఉన్న రైతులకు అందించాలని ఆదేశించారు. యూరియా కొనుగోలు  కోసం డబ్బులు చెల్లించిన రైతులు రసీదు పొందిన వెంటనే యూరియాను తీసుకెళ్లాలని సూచించారు. రసీదు పొంది యూరియాను పిసుకు వెళ్లకుంటే నిల్వలు ఉన్నట్లు పరిగణించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. రైతులు సహకరించి అవసరమేరకు యూరియాను కొనుగోలు చేయాలి తప్ప నిల్వలు చేయకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ ముత్తినేని వెంకటేష్, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad