– డయల్ 100 మిస్ యూస్ కేసులో ఒకరికి మూడు రోజుల జైలు శిక్ష
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
డయల్ 100 ప్రజల అత్యవసర అవసరాల కోసం ఏర్పాటు చేసిన సదుపాయమని, ఇబ్బందుల్లో ఉన్నవారు సహాయం కోసం ఈ నంబరుకు కాల్ చేస్తే పోలీసులు తక్షణమే స్పందిస్తారని కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి అన్నారు. అలాంటి సదుపాయాన్ని దుర్వినియోగం చేస్తే తప్పక కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో డయల్ 100 కు ఫోన్ చేసి మిస్ యూస్ చేస్తూ, న్యూసెన్స్ చేసి పోలీసుల సమయాన్ని వృధా చేసిన మండల కేంద్రానికి చెందిన తన్నీరు వెంకటేష్ కు మూడు రోజుల సాధారణ జైలు శిక్ష విధించినట్లు ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు.
డయల్ 100కు అనవసరంగా పలుమార్లు ఫోన్ చేసి న్యూసెన్స్ క్రియేట్ చేసిన తన్నీరు వెంకటేష్ పై తొలుత కేసు నమోదు చేసినట్లు, అనంతరం ఆ వ్యక్తిని ఆర్మూర్ కోర్టులో హాజరుపరచగా ఆర్మూర్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గట్టు గంగాధర్ మూడు రోజుల సాధారణ జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. డయల్ 100 ప్రజల అత్యవసర అవసరాల కోసం ఏర్పాటు చేసిన సదుపాయం, ఇబ్బందుల్లో ఉన్నవారు సహాయం కోసం ఈ నంబరుకు కాల్ చేస్తే పోలీసులు తక్షణమే స్పందిస్తారని, అలాంటి సదుపాయాన్ని దుర్వినియోగం చేస్తే తప్పక కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ అనిల్ రెడ్డి హెచ్చరించారు.
డయల్ 100 దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES