Thursday, January 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జూదం, కోడి పందాలు నిర్వహిస్తే కఠి‌న చర్యలు: ఎస్సై

జూదం, కోడి పందాలు నిర్వహిస్తే కఠి‌న చర్యలు: ఎస్సై

- Advertisement -

నవతెలంగాణ – కన్నాయిగూడెం
ములుగు జిల్లా కన్నాయి గూడెం మండలంలో తూపాకుల గూడెం బ్యారేజి వద్ద తనిఖీలు చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ రోజుల్లో సాంప్రదాయ క్రీడల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కోడిపందాలు జూదం, డ్రగ్స్, గుట్కాలు లాంటి ఇలా ఏ వ్యసనమైన ప్రజల జీవితాన్ని నాశనం చేస్తుందన్నారు. అసాంఘిక కార్యాకాలపల్లో పాల్గొనేవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమన్నారు.

పందేలలో జూదరులు, కోడికత్తుల తయారీ దారులు, జూద నిర్వాహకులపై ఇప్పటికే జిల్లాలో బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారన్నారు. జూద నిర్వహుకులపై ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారన్నారు. ఇకపై ఉపేక్షించేది లేదని వారిపై గట్టి నిఘా ఉంచి, పందాలు కాసి డబ్బును నష్టపోవడం వలన కుటుంబాల్లో పండుగ వేళ ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు. పందేలలో ఎవరైన భూములు, స్థలాలు ఇచ్చిన  యాజమానులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని కన్నాయిగూడెం ఎస్ఐ వెంకటేష్ హెచ్చరించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -