Saturday, October 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డ్రగ్స్, గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు: సీఐ శ్రీనివాస్ 

డ్రగ్స్, గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు: సీఐ శ్రీనివాస్ 

- Advertisement -

నవతెలంగాణ- దుబ్బాక
డ్రగ్స్, గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ పీ. శ్రీనివాస్ అన్నారు. ప్రజల భాగస్వామ్యం తోనే వీటి నియంత్రణ సాధ్యమన్నారు. గురువారం దుబ్బాకలోని పలు వైన్స్, కల్లు దుకాణాలు కిరాణా, టీ, పాన్ షాపుల్లో నార్కోటిక్ డాగ్స్ తో తనిఖీలు నిర్వహించారు. తాత్కాలిక ఆనందం కోసం యువత తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని కోరారు. డ్రగ్స్, గంజాయి విక్రయం, వినియోగం పట్ల పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ కే. కీర్తిరాజు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది అజయ్ కుమార్, పోలీసు సిబ్బంది ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -