Friday, July 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్14 ఏండ్లలోపు పిల్లలతో పని చేయిస్తే కఠిన చర్యలు: సీఐ

14 ఏండ్లలోపు పిల్లలతో పని చేయిస్తే కఠిన చర్యలు: సీఐ

- Advertisement -

నవతెలంగాణ- దుబ్బాక : 14 ఏళ్ల లోపు ఉన్న బాల బాలికలతో పనిచేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని సీఐ పీ.శ్రీనివాస్ అన్నారు. వివిధ వ్యాపారాలు, హోటల్లు, వాణిజ్య సముదాయాలు, ఫ్యాక్టరీలలో బాలలను పనిలో పెట్టుకోవద్దని సూచించారు. గురువారం దుబ్బాకలోని సీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. చట్ట ప్రకారం 14 ఏళ్ల లోపు పిల్లల్ని పనిలో పెట్టుకోవద్దని, అలా ఎవరైనా పని చేయిస్తున్నట్లు తెలిస్తే.. కార్మిక శాఖ, పోలీస్ లకు సమాచారం అందించాలన్నారు. అలాగే బాల్య వివాహాలను అడ్డుకునేందుకు చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లకు తెలియజేయాలని, ఎవరైనా బాల్యవివాహాలను ప్రోత్సహించినా.. జరిపించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -