Saturday, September 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనాలాలను కబ్జా పెడితే కఠిన చర్యలు

నాలాలను కబ్జా పెడితే కఠిన చర్యలు

- Advertisement -

– హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌
నవతెలంగాణ – ముషీరాబాద్‌

వరద నీరు సాఫీగా ప్రవహించ కుండా అడ్డుకట్ట వేస్తూ నాలాలను కబ్జా పెడితే కఠిన చర్యలు తీసుకుం టామని హైడ్రా కమిషనర్‌ రంగ నాథ్‌ హెచ్చరించారు. హైదారబాద్‌ లో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని గాంధీనగర్‌ డివిజన్‌ అశోక్‌నగర్‌ స్ట్రీట్‌ నెంబర్‌ 6లోని, హుస్సేన్‌సాగర్‌ నాలాకు ఆనుకొని ఉన్న శ్రీసత్యనారాయణ స్వామి దేవాలయం ప్రహరీ కూలడంతో వరద నీరు కాలనీ, దేవాలయాన్ని ముంచెత్తింది. దాంతో కార్పొరేటర్‌ ఎ.పావని వినరు కుమార్‌కు స్థానికులు ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్‌ శుక్రవారం హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌ రామాంజనేయులు రెడ్డి, ఇంజినీరింగ్‌, ఇరిగేషన్‌ అధికారులు, బీజేపీ సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ జాయింట్‌ కన్వీనర్‌ ఎ.వినరు కుమార్‌ సంబంధిత అధికారులతో కలిసి సమస్యాత్మక ప్రదేశాన్ని సందర్శించారు. దేవాలయం గోడను ఇరిగేషన్‌ సిబ్బంది ద్వారా వెంటనే నిర్మించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అనంతరం స్థానికుల ఫిర్యాదు మేరకు.. సమీపంలో వరద నీరు వెళ్లకుండా అడ్డుగా ఉన్న అపార్ట్‌మెంట్‌ అక్రమ నిర్మాణాన్ని హైడ్రా కమిషనర్‌ పరిశిలించారు. దీనిపై వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని, వరద ముంపును కట్టడి చేసేందుకు తక్షణ ప్రత్యేక చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. బీజేపీ డివిజన్‌ అధ్యక్షులు వి.నవీన్‌ కుమార్‌, కాలనీవాసులు కృష్ణయ్య, కృష్ణమాచారి, మెహర్‌ జి.రామకృష్ణ, కిరణ్‌, వీరప్రసాద్‌, భారతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -