- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
ఉమ్మడి మద్నూర్ మండలం లోని మద్నూర్డ మంలాల్లో ఎక్కడైనా పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై విజయ్ కొండ హెచ్చరికలు జారీ చేశారు. పేకాట ఆడుతున్నట్లు సమాచారం ఇచ్చిన వారి పేర్లు గుప్తంగా ఉంచుతామని గ్రామాల్లో పేకాట ఆడకుండా నివారణ చర్యలు కోసం సమాచారం ఇవ్వాలని ఇరు మండలాల ప్రజలను కోరారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీస్ సిబ్బంది కలిసి మద్నూర్ మండలం లోని కోడిచిర గ్రామంలో పేకాట ఆడుతున్న వారిపై రైడ్ చేయడం జరిగిందని. పేకాట ఆడుతున్న నలుగురిని పట్టుకొని, వారి వద్ద నుండి రూ.1670/- నగదు మరియు 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
- Advertisement -