Saturday, January 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రెచ్చగొట్టే పోస్టలు పెడితే కఠిన చర్యలు: ఎస్సై వెంకటేష్

రెచ్చగొట్టే పోస్టలు పెడితే కఠిన చర్యలు: ఎస్సై వెంకటేష్

- Advertisement -

నవతెలంగాణ – కన్నాయిగూడెం
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎవరైనా రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకోపడతాయని కన్నాయిగూడెం ఎస్ఐ వెంకటేష్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికలు 2025 నేపథ్యంలో రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మండలంలోని 11 గ్రామ పంచాయతీలోని ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు, యువత ఈ విషయాన్ని గమనించాలన్నారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులు ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని అన్నారు. కన్నాయిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని గ్రామాల వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టవద్దని సూచించారు. రాజకీయపరమైన వ్యాఖ్యలు చేసిన కించపరిచేలా మాట్లాడిన రాష్ట్ర ఎన్నికల సంఘం నియమావళిని ఉల్లంఘించిన చట్టపరమైన చర్యలు కఠినంగా ఉంటాయని అన్నారు. మండలంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ విషయాన్ని గమనించి 17న జరిగే ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులకు సహకరించాలని ఎస్సై వెంకటేష్ ప్రజలను కోరారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -