Saturday, October 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు...

సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు…

- Advertisement -

– సుల్తాన్ బజార్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ బాలకృష్ణ హెచ్చరిక..
నవతెలంగాణ -సుల్తాన్ బజార్ : సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని, అలా చేస్తే శిక్షలు, జరిమానాలు తప్పవని సుల్తాన్ బజార్ ట్రాఫిక్ జి. బాలకృష్ణ అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయన ఎస్ఐ లు భరత్, జానీ పాషా సిబ్బందితో కలిసి కోఠి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా వద్ద ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్న వాహనదారుల పై కొరడాఝుళిపించారు. ఈ సందర్భంగా సెల్ఫోన్ మాట్లాడుతూ ద్విచక్రవాహనం నడుపుతున్న 20 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేశారు. రాంగ్ రూట్ లో ప్రయాణిస్తున్న మరో 15 మంది ద్విచక్ర వాహనదారులకు జరిమానా విధించారు. మద్యం సేవించి, సెల్ ఫోన్ ట్లాడుతూ, హెల్మెట్ ధరించక పోవడం, రాంగ్ రూట్ లో వెళ్లడం, వాహనాలు నడుపుతున్న మైనర్ల పై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -