Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంకంపెనీ సమాచారం బయటి వారికి ఇస్తే కఠిన చర్యలు

కంపెనీ సమాచారం బయటి వారికి ఇస్తే కఠిన చర్యలు

- Advertisement -

– ఎవరన్నా బెదిరిస్తే యాజమాన్యానికి చెప్పండి : సింగరేణి డైరెక్టర్‌ ఉత్తర్వులు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

కంపెనీ సమాచారాన్ని బయటి వ్యక్తులకు చేరవేస్తే కఠిన చర్యలు తప్పవని సింగరేణి డైరెక్టర్‌ (ప్లానింగ్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌) కే వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరైనా అలాంటి సమాచారం కోసం బెదిరింపులు, ఒత్తిడికి గురి చేస్తే, వారి సమాచారాన్ని యాజమాన్యానికి తెలియజేయాలని పేర్కొన్నారు. సంస్థకు సంబంధించిన గోప్యనీయ సమాచారాన్ని తమకు ఇవ్వాలని కొందరు వ్యక్తులు కంపెనీ ఉద్యోగులు, అధికారులను బెదిరిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారిని లెక్కచేయాల్సిన అవసరం లేదనీ, ఎలాంటి డాక్యుమెంట్లను ఇతరులకు ఇవ్వరాదని స్పష్టంచేశారు. కంపెనీలో వివిధ కింది శాఖల నుంచి పైశాఖల వారికి పంపించే నోట్‌ ఫైల్స్‌, ముఖ్యమైన పత్రాలను అత్యవసర సందర్భంలో కంపెనీ మెయిల్‌ ద్వారా పంపించవచ్చని, కానీ వాట్సాప్‌ ద్వారా మాత్రం పంపించకూడదని మరొక సర్క్యులర్‌లో పేర్కొన్నారు. వాట్సప్‌ ద్వారా పంపిస్తున్న సమాచారం ఇతరులకు లీక్‌ అయ్యే అవకాశం ఉందనీ, అందువల్ల కంపెనీ నోట్‌ ఫైల్స్‌, సమాచార ఫైల్స్‌ పంపించేందుకు వినియోగించవద్దని ఆదేశించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad