Thursday, September 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉద్యోగుల విధులకు ఆటంకం కల్పిస్తే కఠిన చర్యలు

ఉద్యోగుల విధులకు ఆటంకం కల్పిస్తే కఠిన చర్యలు

- Advertisement -

– రాయపోల్ ఎస్ఐ కుంచం మానస
నవతెలంగాణ- రాయపోల్

ఉద్యోగుల విధులకు ఆటంకం కల్పిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని రాయపోల్ ఎస్ఐ కుంచం మానస హెచ్చరించారు. గురువారం రాయపోల్ మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో నీటిపారుదల శాఖ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. మండల పరిధిలోని లింగారెడ్డిపల్లి గ్రామా శివారులోని విశ్వనాథ చెరువు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిస్థాయిలో నిండింది. నిండుకుండ లాగా మారిన ఆ చెరువు కట్ట తెగిపోకుండా గతంలో గండి కొట్టారు.

గురువారం లింగారెడ్డిపల్లికి చెందిన కొందరు రైతులు అట్టి గండిని పూడ్చి వేయడానికి దానికి అడ్డుగా మట్టినిపోసి నీటిని బయటకి పోకుండా ఆపుతున్నారు.ఇట్టి విషయం తెలుసుకున్న స్థానిక నీటి పారుదల శాఖ ఉద్యోగి మన్నే రవి అక్కడికి వెళ్లి వారిని ప్రశ్నించగా, అక్కడ ఉన్న పలువురు రైతులు సదరు ఉద్యోగి పై బూతు మాటలు తిడుతూ అతని విధులకు ఆటంకం కల్పించారు. ఇట్టి సంఘటనపై సదరు ఉద్యోగి మన్నే రవి రాయపోల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఉద్యోగి విధులకు ఆటంకం కల్పించిన వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -