Tuesday, December 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు: సీఐ శ్రీనివాస్ 

శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు: సీఐ శ్రీనివాస్ 

- Advertisement -

నవతెలంగాణ- దుబ్బాక
ప్రలోభాలకు గురి కాకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఐ పీ. శ్రీనివాస్ అన్నారు. శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం దుబ్బాక మండలం హబ్సిపూర్, రామక్కపేట గ్రామాల్లో సీఐ శ్రీనివాస్ నేతృత్వంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. డబ్బు, మద్యం, ఇతర వస్తువులతో ఎవరైనా అభ్యర్థులు ప్రలోభాలకు గురి చేసే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర విమర్శలు, పోస్టులను షేర్ చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎస్ఐ కే. కీర్తి రాజు, ఏఆర్ ఎస్సైలు, పోలీసు సిబ్బంది పలువురు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -