Thursday, January 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

- Advertisement -

– 120 ప్రాంతాల్లో ‘డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌’ సోదాలు
– తాగిన వారు డ్రైవింగ్‌ చేయకుండా క్యాబ్‌లలో వెళ్లాలి : హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో

నూతన సంవత్సర వేడుకల్లో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామని హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. బుధవారం బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో నుంచి క్షేత్రస్థాయి అధికారులతో సీపీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి సూచనలు సలహాలు చేశారు. ముఖ్యంగా ఈవెంట్ల సమయపాలన, మద్యం విక్రయాలు, ట్రాఫిక్‌ నిబంధనలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. న్యూఇయర్‌ ఈవెంట్లు, వేడకలకు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మాత్రమే అనుమతించామని చెప్పారు. ఆ సమయం దాటి వేడుకలు నిర్వహించినా, నిబంధనలకు విరుద్ధంగా సౌండ్‌ సిస్టమ్స్‌ వినియోగించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిని గుర్తించేందుకు ఈసారి ముందుగానే తనిఖీలు చేపట్టామన్నారు. బుధవారం రాత్రి 7 గంటల నుంచి 120 ప్రాంతాల్లో ‘డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌’ సోదాలు నిర్వహించినట్టు తెలిపారు. మద్యం మత్తులో పట్టుబడితే భారీ జరిమానా, జైలు శిక్షతోపాటు లైసెన్స్‌ రద్దు, వాహనాల సీజ్‌ చేస్తామన్నారు. జనవరి మొదటి వారం వరకు ఈ స్పషల్‌ డ్రైవ్‌ కొనసాగుతుందని సీపీ తెలిపారు. మద్యం సేవించిన వారు డ్రైవింగ్‌ చేయకుండా క్యాబ్‌ లేదా డ్రైవర్లను ఆశ్రయించాలన్నారు. క్యాబ్‌, ఆటో డ్రైవర్లు అదనపు చార్జీలు డిమాండ్‌ చేసినా చర్యలు తప్పవన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -