Wednesday, March 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
జిల్లాలో ఆటో రిక్షాలొ, ఇతర వాహనాలలో ప్రయాణించే విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా రవాణా అధికారి జె. శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఆటో రిక్షాలు, మినీ క్యాబ్ ల పై విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా మద్నూర్ లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాహనాలు సహాయక మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్స్ ఉదయ్ కుమార్, మహమ్మద్ రఫీ సీజ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వాహనదారులు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడపకూడదని నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపే సమయంలో వారు సురక్షితంగా ప్రయాణిస్తున్నారా అనే విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, రహదారి భద్రత నియమాలను పాటించేలా రవాణా శాఖకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -