Wednesday, February 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమున్సిపల్‌ ఎన్నికల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు

మున్సిపల్‌ ఎన్నికల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు

- Advertisement -

పోలీసు అధికారులకు డీజీపీ హెచ్చరిక
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి

రాష్ట్ర మున్సిపల్‌ కార్పొరేషన్స్‌, మున్సిపాల్టీ ఎన్నికల్లో నిబందనలు ఖచ్చితంగా అమలు చేయాలనీ, అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవనీ, రాష్ట్ర డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి హెచ్చరించారు. మున్సిపల్‌ ఎన్నికల బందోభస్తుపై మంగళవారం ఆయన నగర పోలీసు కమిషనర్లు, సంబధిత జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ల పర్వం మొదలుకుని కౌంటింగ్‌ వరకు విధి నిర్వాహణలో ఎలాంటి నిర్లక్ష్యం కూడదనీ, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూడాలనీ, అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఎన్నికల నియమావళిని అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు తూచ తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఎన్నికల నియామావళిని ఉల్లంఘించిన వారిపై చట్ట రిత్యా చర్యలు తీసుకోవటంలో ఏ మాత్రం వెనుకంజ వేయరాదని ఆయన స్పష్టం చేశారు. శాంతి భద్రతకు విఘాతం కలిగించే వారిపై గట్టి నిఘా వేసి ఉంచాలనీ, రౌడీలు, గుండాలను బైండోవర్‌ చేయాలని డీజీపీ ఆదేశించారు. ఎక్సైజ్‌ నిబంధనలను అతిక్రమించినా, పోటీలో ఉన్న వారు ఓటర్లను బెదిరించినా, వారిని మభ్యపెట్టడానికి ఎలాంటి వస్తువులు, నగదును పంచి పెట్టినా కనిపెట్టి చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు. ఆయుధాలు లైసెన్స్‌ ఉన్న వారు వెంటనే స్థానిక పోలీసు స్టేషన్లలో ఎన్నికలు ముగిసేంత వరకు వాటిని డిపాజిట్‌ చేసేందుకు చర్యలు తీసుకోవాలనీ, చేయని వారికి ఏడాదిన్నర జైలు శిక్ష తప్పదని హెకచ్చరించాలని తెలిపారు. శాంతి భద్రతల పరంగా సమస్యాత్మక ప్రాంతాల్లో సాయుధపికెట్లను ఏర్పాటు చేయాలనీ, ఆ ఏరియాల్లో గస్తీలు కూడా విస్తృతం చేయాలని డీజీపీ తెలిపారు. బూతుల స్వాదీనం, బెదిరింపులకు పాల్పడే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలనీ, మొత్తం మీద ఈ ఎన్నికల్లో ప్రతి ఓటరు నిర్భయంగా ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -