Wednesday, October 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో విద్యార్థులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు: కలెక్టర్

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో విద్యార్థులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – వనపర్తి
 జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో చదువుకుంటున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు యాజమాన్యాలు ఇబ్బందులు పెడితే చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం బెస్ట్ అవైలబుల్ పాఠశాలల ఫీజు రీయింబర్స్మెంట్, విద్యార్థులు వారి తల్లిదండ్రులకు యాజమాన్యాల ద్వారా కల్పిస్తున్న సమస్యల పై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, విద్యా శాఖ, వివిధ సంక్షేమ శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీలు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆయా జిల్లాలలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పాఠశాలలకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, యాజమాన్యాలు కల్పిస్తున్న ఇబ్బందుల పై అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున ఎస్సీ, ఎస్టీలలోని బెస్ట్ విద్యార్థులను బెస్ట్ అవైలబుల్ స్కూల్ కు ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి నిబంధనలకు అనుగుణంగా పంపించడం జరుగుతుందని అలాంటప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ కొంత ఆలస్యం అయినంత మాత్రాన విద్యార్థులకు పాఠశాలలకు రానివ్వకుండా ఇబ్బందులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ నిబంధనలు అనుసరించి ఇబ్బందులు కల్పించే పాఠశాల యాజమాన్యాల పై చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని ఈ పరిస్థితుల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ విద్యార్థులకు లేదా వారి తల్లిదండ్రులకు గానీ పాఠశాల యాజమాన్యాల నుండి ఇబ్బందులు సృష్టించడానికి వీలు లేదని తెలిపారు.  

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో ఎస్సీ విద్యార్థులకు (6) బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు, ఎస్టీ విద్యార్థులకు (2) బెస్ట్ అవైలబుల్ పాఠశాలలతో ఒప్పందం చేసుకొని విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. ఇప్పటికే పాఠశాల యాజమాన్యాలతో మాట్లాడటం జరిగిందని, విద్యార్థులు అందరూ పాఠశాలల్లో చదువుకుంటున్నట్లు తెలిపారు.  పాఠశాల యాజమాన్యాలు విద్యార్థులకు ఇబ్బందులు సృష్టిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్ ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య, పి.డి. డి ఆర్ డి ఓ ఉమాదేవి, ఎస్సీ కార్పొరేషన్ ఈ.డి మల్లికార్జున్, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి అఫ్జలుద్దీన్, బి.సి. సంక్షేమ శాఖ అధికారి ముజాహిద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -