Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మీసేవలో అదనపు రుసుము వసూలు చేస్తే కఠిన చర్యలు: ఈడియం శ్రీకాంత్

మీసేవలో అదనపు రుసుము వసూలు చేస్తే కఠిన చర్యలు: ఈడియం శ్రీకాంత్

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
మీ సేవా  ద్వారా అందించే పౌర సేవలకు ప్రభుత్వం నిర్దేశించిన రుసుము కంటే  అదనంగా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈడీఎం శ్రీకాంత్ స్పష్టం చేశారు. శనివారం కాటారం మండల కేంద్రంలోగల  మీ సేవా కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా , ప్రజలకు అందిస్తున్న సేవలు, సౌకర్యాలు తదితర అంశాలను పరిశీలించారు.

 ప్రజలు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే సంబంధిత అధికారులను సంప్రదించాలని, ప్రజలకు మరింత మెరుగైన సేవలందించాలని నిర్వాహకులకు సూచించారు. ప్రజలకు అంతరాయం లేకుండా సేవలు అందించాలని  తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలందించడమే మీ సేవా కేంద్రాల కర్తవ్యం అని తెలిపారు.  మీ సేవా కేంద్రాల ద్వారా అందించు సేవలకు సంబంధించి ధరల పట్టిక ఏర్పాటు చేయాలని మీ సేవా కేంద్రం నిర్వహకులను ఆదేశించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad