నవతెలంగాణ – పెద్దవూర
శిశువు విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని అనుముల ఐసీడీఎస్ ప్రాజెక్టు అంగన్వాడీ సూపర్ వైజర్ గౌసియా బేగం అన్నారు. మహిళ శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి ఆదేశాల ప్రకారం శుక్రవారం మండలపరిధిలోని చలకుర్తిసెక్టార్ పరిధిలో ని రామన్నగూడెం తండా లో నిర్వహించిన సమావేశం అంగన్వాడీ టీచర్లకు శిశు విక్రయాలు జరుగ కుండా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా సూపర్ వైజర్ మాట్లాడుతూ.. గత మూడు రోజుల క్రితంతిరుమల గిరి సాగర్ మండలం అడపిల్ల శిశు విక్రయాలు జరుగాయని, ఈ విషయం పై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పందించారని అన్నారు. ఎవరైనా శిశువులను విక్రయించేందుకు ప్రయత్నించిన, విక్రయించిన, చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని తెలియజేశారు. ఆడపిల్లల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసిందని పథకాలను వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు,గ్రామస్తులు,లబ్ధిదారులు పాల్గొన్నారు.
శిశువు విక్రయాలు జరిపితే చట్టరీత్యా కఠిన చర్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES

 
                                    