జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి సునంద
నవతెలంగాణ – వనపర్తి
బాల్య వివాహాల నిర్మూలనకు కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారిని సునంద తెలిపారు. రూరల్ డెవలప్మెంట్ సొసైటీ, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ సంస్థల ఆధ్వర్యంలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా రూపొందించిన హోర్డింగ్స్ ను కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్లో జిల్లా బాలల సంరక్షణ అధికారి నరసింహ, లీగల్ ఆఫీసర్ శివ, రూరల్ డెవలప్మెంట్ సొసైటీ జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కొమ్మ చంద్రశేఖర్ తో కలిసి సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి వ్యవస్థ ప్రతి పౌరుడు అంకితభావంతో పనిచేయాలని సమాజంలోని అన్ని వైపుల నుంచి బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె కోరారు.
18 సంవత్సరాల లోపు అమ్మాయిలకు మరియు 21 సంవత్సరాల లోపు అబ్బాయిలకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని దీన్ని అతిక్రమించిన వారికి రెండు సంవత్సరాల జైలు శిక్ష లేదా లక్ష రూపాయల జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉంటుందని ఆమె వివరించారు. రూరల్ డెవలప్మెంట్ సొసైటీ మరియు జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ ఆధ్వర్యంలో గద్వాల జిల్లాలోని 50 గ్రామాలలోని దేవాలయాలు ,మసీదులు ,చర్చిల యందు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా రూపొందించబడిన హోల్డింగ్స్ ను ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా కోఆర్డినేటర్ కొమ్మ చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలల సంరక్షణ అధికారి నరసింహ మరియు లీగల్ ఆఫీసర్ శివ పాల్గొన్నారు.
బాల్య వివాహాల నిర్మూలనకు కఠిన చర్యలు చేపట్టాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES