గంజాయి కేసుల చెదనలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సిబ్బందికి ప్రోత్సాహకాలు, ప్రసంశ పత్రాలు
జిల్లాలో ఆరు నెలల వ్యవధిలో 37 కేసులలో 95 మంది అరెస్ట్,
3.500 గ్రాముల గంజాయి,12 గంజాయి చెట్లు స్వాధీనం: జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, గంజాయి కేసులల్లో నిందుతులుగా ఉన్నవారిపై నిఘా కఠినతరం చేసి గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే సిబ్బందికి సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గంజాయి కేసుల చేదనలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీస్ సిబ్బందికి ప్రోత్సాహకాలు,ప్రసంశ పత్రాలు ఎస్పీ అభినందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ… జిల్లాలో గంజాయి నిర్ములనకు పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుందని, గంజాయి నిర్ములనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని, గంజాయి కొన్న, సేవించిన, రవాణా చేసిన, విక్రయించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి జిల్లాలో స్పెషల్ డ్రైవ్ లు, నార్కోటిక్ జగిలాలతో తనిఖీలు చేపడుతూ అక్రమ గంజాయి రవాణాపై, గంజాయి కేసులల్లో నిందుతులుగా ఉన్న వారిపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి ఉక్కుపాదం మోపుతున్నారన్న్నారు. గడిచిన ఆరు నెలల్లో జిల్లాలో 37 కేసులలో 95 మందిని అరెస్ట్ చేసి 3.500 గ్రాముల గంజాయి,12 గంజాయి చెట్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో గంజాయికి సంబంధించిన సమాచారం సబంధిత పోలీస్ వారికి అందించి గంజాయి రహిత జిల్లాగా మర్చడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు.
గంజాయి రవాణా, నిందితులపై పటిష్ట నిఘా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES