Tuesday, January 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎన్నికల భద్రతపై కఠిన నిఘా: అచ్చంపేట సీఐ, ఎస్సై

ఎన్నికల భద్రతపై కఠిన నిఘా: అచ్చంపేట సీఐ, ఎస్సై

- Advertisement -

– శాంతియుత ఎన్నికల కోసం ప్రతి క్లస్టర్ కేంద్రంలో అదనపు సిబ్బంది మోహరింపు
నవతెలంగాణ – ఉప్పునుంతల

ఉప్పునుంతల మండలంలో మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. మండల పరిధిలోని 27 గ్రామపంచాయతీలను 7 క్లస్టర్లుగా విభజించి నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేయగా, పోలీసు విభాగం ఎన్నికల భద్రతను పటిష్టం చేసింది.

పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక భద్రతా చర్యలు మండలంలో ఎన్నికల ప్రక్రియ ఎలాంటి అవాంఛిత పరిస్థితులు తలెత్తకుండా ఎస్సై వెంకట్ రెడ్డి పరిధిలో ప్రతి క్లస్టర్ కేంద్రంలో అదనపు సిబ్బందిని మోహరించారు. నామినేషన్ స్వీకరణ కేంద్రాలను అచ్చంపేట సీఐ నాగరాజు, ఎస్సై వెంకట్ రెడ్డి సందర్శించి భద్రతా ఏర్పాటు, సిబ్బంది డ్యూటీలను పర్యవేక్షించారు.

శాంతి భద్రత కోసం ప్రజల సహకారం తప్పనిసరి
ఎన్నికల సమయంలో ప్రజలు చట్టానికి అనుగుణంగా ప్రవర్తించాలని, శాంతి భద్రతను భంగపరచే చర్యలకు పాల్పడవద్దని గ్రామాల్లో ఉద్రిక్తతలు, గుంపుల గొడవలు, బూతుచాతుర్యం, బెదిరింపులు చేయడం వంటి చర్యలను పోలీసులు కఠినంగా పర్యవేక్షణ ఉన్నట్లు పోలీసు అధికారులు విజ్ఞప్తి చేశారు. “ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు ప్రజల సహకారం అత్యంత అవసరం. ఎలాంటి వివాదాలు, అల్లర్లు సృష్టించినా కఠినంగా కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని ఎస్సై వెంకట్ రెడ్డి హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -