నవతెలంగాణ – హైదరాబాద్: కేంద్ర కార్మిక సంఘాలు, ఇండిపెండెంట్ ఫెడరేషన్లు ఇచ్చిన పిలుపుమేరకు నేడు అఖిలభారత జాతీయ ఒకరోజు సమ్మె దిగ్విజయంగా జరుగుతున్నది. జాయింట్ ఫోరమ్ ఆఫ్ ఫైనాన్సు సెక్టార్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాదు ఎల్ ఐసి డివిజనల్ కార్యాలయంలో సమ్మె ర్యాలీ నిర్వహించబడుతున్నది. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల నుంచి 600 మందికి పైగా ఈ సమ్మె ర్యాలీలో పాల్గొంటున్నారు. ముఖ్య అతిధులుగా సిఐటియు రాష్ట్ర నాయకులు ఎస్ వీరయ్య , ఏఐటియుసి రాష్ట్ర నాయకులు బోస్ గారు పాల్గొంటున్నారు.
వీరితోపాటు ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మిశ్రా, అఖిలభారత గ్రామీణ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి కూడా హాజరవుతున్నారు. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల ఐక్య సంఘటన ఈ క్రింద తెలిపిన ప్రధాన డిమాండ్లను ఈ ఒకరోజు సమ్మె ద్వారా ప్రస్తావించనున్నది. ప్రభుత్వ రంగ బ్యాంకులను, ఇన్సూరెన్స్ కంపెనీలను బలోపేతం చేయాలి. ట్యాంకు. గ్రామీణ బ్యాంకు, ఇన్సూరెన్స్ రంగ ప్రవేటీకరణ వంటి ఆలోచనలను కేంద్ర ప్రభుత్వం విడనాడాలి.
