Tuesday, May 6, 2025
Homeరాష్ట్రీయంసమ్మెతో సంస్థ ప్రగతికి, ఉద్యోగులకు నష్టం

సమ్మెతో సంస్థ ప్రగతికి, ఉద్యోగులకు నష్టం

- Advertisement -

– ఎస్మా చట్టం ప్రకారం ఆర్టీసీలో సమ్మెలు నిషేధం
– సమ్మె పేరుతో విధులకు ఆటంకం కలిగిస్తే చర్యలు
– సంస్థ మేలు కోసం ఆలోచించండి : ఆర్టీసీ యాజమాన్యం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సమ్మెతో సంస్థ ప్రగతికి, ఉద్యోగులకు నష్టమని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది. ఈ మేరకు సోమవారం ఉద్యోగులనుద్దేశించి ఒక లేఖను విడుదల చేసింది. ఎస్మా చట్టం ప్రకారం ఆర్టీసీలో సమ్మెలు నిషేధమని స్పష్టం చేసింది. సమ్మెల పేరుతో ఉద్యోగుల విధులకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించింది. సమ్మెలు సమస్యలకు పరిష్కారం కాదని సూచించింది. 2019 సమ్మె కాలంలో 39 మంది ఉద్యోగులను కోల్పోయామనీ, ఆ తర్వాత కరోనా కారణంగా మరింత సంక్షోభంలోకి వెళ్లిన విషయాలను గుర్తుచేసింది.
ఉద్యోగుల సంక్షేమం విషయంలో ఏ మాత్రం రాజీపడేది లేదని తేల్చిచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి యాజమాన్యం కట్టుబడి ఉందనీ, ఆర్టీసీ బాగుంటేనే ఉద్యోగులందరూ బాగుంటారనీ, సమ్మె ఆలోచనను విరమించాలని విజ్ఞప్తి చేసింది. ఒక వర్గం తమ మనుగడ కోసం చెప్పే మాటలకు ప్రభావితమై సమ్మెకు వెళితే సంస్థతో పాటు ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందని మరిచిపోవద్దని కోరింది. ప్రజలకు రవాణాపరమైన ఇబ్బందులు కలగకుండా సేవలందించాల్సిన బాధ్యత ప్రతి ఉద్యోగిపై ఉందని పేర్కొంది.
మూడున్నరేళ్లుగా సంస్థ బాగు కోసం యాజమాన్యం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ఉద్యోగులు స్వాగతించి వాటిని విజయ వంతం చేశారని తెలిపింది. అభివృద్ధి వైపు అడుగులు వేస్తోన్న సమయంలో సమ్మె పేరుతో చేజేతులా సంస్థ మనుగడకు, ఉద్యోగుల భవిష్యత్‌ కు ముప్పు వాటిల్లే విధంగా వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేసింది. ప్రతి రోజు 60 లక్షల మంది ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరుస్తున్న ఉద్యోగుల సంక్షేమం విషయంలో రాజీపడటం లేదని తెలిపింది. సంస్థకు వచ్చే ప్రతి రూపాయిని ఉద్యోగుల సంక్షేమానికి వెచ్చిస్తున్నామనీ, ఎన్నో ఏళ్లు గా పెండింగ్‌లో ఉన్న 2017 పీఆర్సీని 21 శాతం ఫిట్‌మెంట్‌తో 2024 మే నెలలో యాజమాన్యం అందించిందని గుర్తుచేసింది. పెండింగ్‌లో ఉన్న 10 డీఏలను 2019 నుంచి దశలవారీగా విడుదల, ఆర్పీఎస్‌-2013 బాండ్లకు సంబంధించిన రూ.280 కోట్లను చెల్లింపు, గత మూడున్నరేళ్లుగా విధిగా ప్రతి నెల 1వ తేదినే వేతనాలు,పీఎఫ్‌, సీసీఎస్‌ రికవరీ మొత్తాలను ప్రతి నెల క్రమం తప్పకుండా చెల్లిస్తూ బకాయిలను క్రమేణా యాజమాన్యం తగ్గిస్తోందని వివరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -