నవతెలంగాణ – ఆర్మూర్: ఈనెల 9న నిర్వహించే, సర్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని సిఐటియు మండల్ కన్వీనర్ కూతాడి ఎల్లయ్య ఆధ్వర్యంలో సోమవారం మెడికల్ ఆఫీసర్ కు నోటీస్ అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల కన్వీనర్ మాట్లాడుతూ.. ఆశా వర్కర్ల సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదని అన్నారు. ఆశ వర్కర్ల అందరినీ పర్మినెంట్ చేసి, ఈఎస్ఐ పీఎఫ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రయివేటుపరం చేస్తూ సామాన్య ప్రజలపై భారాల మోపుతూ, పెట్టుబడిదారులకు అనుకూలంగా కార్మిక చట్టాలను సవరించి, ప్రశ్నించకుండా చేస్తుందని అన్నారు. కార్మిక చట్టాలను నిరసిస్తూ మే9న తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో ఆశా వర్కర్లందరూ పాల్గొంటారని అన్నారు. కార్మికులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ అర్బన్ హెల్త్ సెంటర్ అధ్యక్షురాలు భాగ్య, స్వప్న, అనిత, సరూప తదితరులు పాల్గొన్నారు.