Tuesday, May 13, 2025
Homeతెలంగాణ రౌండప్ఎంపీడీఓకు సమ్మె నోటీస్ అందజేత..

ఎంపీడీఓకు సమ్మె నోటీస్ అందజేత..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్: మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మె లో గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులందరూ పాల్గొంటారని తెలియజేస్తూ జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ కు మంగళవారం సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది . దశాబ్ద కాలంగా కార్మిక వర్గం అనేక ప్రాణ తగాలు, పోరాటలతో సాధించుకున్న  29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ తీసుకువచ్చి వాటి అమలకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ కోడ్స్ అమలు జరుగుతే కార్మిక సంఘాలు ఏర్పాటు కష్టతరం అవుతుంది. కార్మికుల సమిష్టి బీరసాల శక్తి నెర్వీరం చేయబడుతుంది. ఉద్యోగ భద్రత, ఉపాధి కోల్పోపోతారు. కార్మిక శాఖ కూడా నిర్వీర్యం చేయబడుతుందని, ఈ సందర్భంగా పాల్గొన్న సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ అన్నారు. దేశంలోని పరిస్థితిని వాటిని సమీక్ష చేసిన కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు అసోసియేషన్లు బిజేపి ప్రభుత్వ ప్రజల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా మేము కూడా మే 20న సార్వత్రిక సమ్మెలో పాల్గొంటామని తెలియజేస్తూ తమరికి సమ్మె నోటీస్ ఇస్తున్నాం. ఈ కార్యక్రమంలో జుక్కల్ మండల అధ్యక్షులు గోవింద్, కార్యదర్శి అషుఖాన్, జుక్కల్ టౌన్ అధ్యక్షులు విరయ్య , కార్యదర్శి మధు, వివిధ గ్రామపంచాయతీ కార్మికులు సంజు, మారుతీ, పండరి, దౌలజీ, రాములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -