ప్రజాబాటలో ఇంచార్జి ఏఈ శేఖర్
నవతెలంగాణ – మల్హర్ రావు
వినియోగదారులకు అంతరాయం లేని నిరంతర విద్యుత్ సరఫరా చేయడానికి కృషి చేస్తున్నట్లుగా విద్యుత్ శాఖ మండల ఇంచార్జి ఏఈ శేఖర్ తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాబాటలో భాగంగా శనివారం తాడిచెర్లలో ప్రజాబాట చేపట్టారు. విద్యుత్ వినియోగంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రజా బాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు.
విద్యుత్ సమస్యలు ఎదురైతే వినియోగదారులు సంబంధిత అధికారులను, ఉద్యోగులను సంప్రదించడం, ఫిర్యాదులు చేయడం వంటి అంశాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. విద్యుత్ బిల్లుల ఆన్లైన్ చెల్లింపు పద్ధతులు, విద్యుత్ వినియోగంపై రైతులు తీసకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ట్రాన్స్ పార్మర్లు కాలిపోతే ఫిర్యాదు చేసే విధానం, సోలార్ విద్యుత్ ఏర్పాటు, రాయితీల వంటి వాటిపై ప్రజలకు వివ రించారు. ఈ కార్యక్రమంలో జేఎల్ఎం మహేందర్ రావు,అన్మ్యాన్ రాజేశ్,రైతులు పాల్గొన్నారు.



