Friday, February 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబాన్సువాడ పురలో హస్తం జోరు 

బాన్సువాడ పురలో హస్తం జోరు 

- Advertisement -

చైర్మన్ రేసులో కాసుల విజయ బాలరాజ్ 
ఉత్కంఠ భరితంగా సాగిన కౌటింగ్ 
నవతెలంగాణ – బాన్సువాడ, నసురుల్లాబాద్ 

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ లో 19 వార్డుల ఎన్నికలు జరిగాయి. ఎన్నికల కౌంటింగ్ ఎస్ఆర్ఎన్ కే డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. 19 వార్డులకు గాను 19 టేబుల్స్ ఏర్పాటు చేసి మొదట పోస్టల్ ఎన్నికల76 ఓట్ల లెక్కింపు జరిపిన అనంతరం అన్ని వార్డులకు ఒకేసారి కౌంటింగ్ ను ప్రారంభించారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కావడంతో ఎన్నికల ప్రకటన కోసం చుట్టూ పక్కల గ్రామాల నుంచి భారీగా ప్రజలకు, అబిమానులు తరలివచ్చారు. ఎన్నికల కౌటింగ్ వద్ద పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటి ప్రకటించకుండా అన్ని స్థానాలు ఒకేసారి ప్రకటించారు. గెలుపొందిన అభ్యర్థులకు ఎన్నికల ధ్రువ పత్రం అందజేశారు.

బాన్సువాడ మున్సిపల్ లో 19 వార్డులకు గాను మొత్తం ఓట్లు 24188 ఓట్లు ఇందులో పురుషులు 11578, మహిళలు 12599, ఇతరులు 11 ఓట్లు ఉన్నాయి. బాన్సువాడలో మొత్తం వార్డ్ లు 19,పోలింగ్ స్టేషన్ లు 39 మొత్తం అభ్యర్థులు 85, బీఆర్ ఎస్ అభ్యర్థులు 19, కాంగ్రెస్ అభ్యర్థులు 19,బీజేపీ అభ్యర్థులు 17, ఏంఐఎం ఒక్కరు, స్వతంత్ర అభ్యర్ధులు 29 మంది పోటీలో ఉండగా 11 జరిగిన ఎన్నికల్లో 73 శాతం పోలింగ్ అయింది. ఇందులో  పోలైన ఓట్లు 17817,పురుషులు 8541, మహిళలు 9271,ఇతరులు 5 ఓట్లు వేశారు.

బాన్సువాడ పుర గెలుపొందిన పార్టీలు 
మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన పార్టీల స్థానాలు..
కాంగ్రెస్ పార్టీకి 11 స్థానాల్లో గెలుపొందగా, బీఆర్ఎస్ 3 స్థానాలతో సరిపెట్టుకుంది.  బీజేపీ 3 స్థానాల్లో పొందగా 12వ వార్డులో స్వతంత్ర అభ్యర్తి గెలుపొందారు. అలాగే ఏంఐఎం పార్టీ  17వ వార్డులో ఏం ఐ ఎం అభ్యర్థి గెలుపొందారు.

మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు
బాన్సువాడ మున్సిపల్ 19 వార్డుల్లో గెలుపొందిన అభ్యర్థులు 
01 వ వార్డు లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నశ్రీన్ బేగం 

(02 వ వార్డు లో కాంగ్రెస్  పార్టీ విజయం… జంగం రాజశేఖర్

(03 వ వార్డు లో ) కాంగ్రెస్ పార్టీ విజయం… హకీమ్

(04 వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ. విజయం.. గైక్వాడ్ రుక్మిణి

( 05 వ వార్డు లో కాంగ్రెస్  పార్టీ విజయం.. కాసుల విజయ

(06 వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ విజయం.. అంజూమ్ ఖాలీల్ 

( 07 వ వార్డు లో బీజేపీ పార్టీ విజయం.. సామల మనసా

( 08 వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ.. విజయం.. దొన్కంటి శ్యామల వెంకటేశ్

( 09 వ వార్డు లో బీజేపీ పార్టీ విజయం.. పాశం అమని భాస్కర్ రెడ్డి

(10 వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ.. విజయం.. ఎరుకాల నగేష్

(11 వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ.. విజయం.. గదుమాల లింగమేశ్వర్

( 12 వ వార్డు లో స్వతంత్ర అభ్యర్థి విజయం.. గడ్డమీది అంజగౌడ్

( 13 వ వార్డులో కాంగ్రెస్ పార్టీ.. విజయం.. మహ్మద్ అబ్దుల్ ఖలేక్

(14 వ వార్డులో కాంగ్రెస్ పార్టీ.. విజయం.. నార్ల వసంత

(15 వ వార్డులో కాంగ్రెస్ పార్టీ విజయం.. వాన్ కార్ రమేష్

( 16 వ వార్డులో బీజేపీ పార్టీ.. విజయం.. గజ్జెల మహేష్

(17 వ వార్డులో ఏం ఐ ఎం పార్టీ విజయం.. మహ్మద్ ఫర్హానాజ్

(18 వ వార్డులో కాంగ్రెస్ పార్టీ.. విజయం.. రేష్మ ఎజాజ్

(19 వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ విజయం.. ఎండీ మక్బూల్ లు గెలుపొందారు. ఆయా వార్డులో తమకు నచ్చిన అభ్యర్థులు గెలుపొందడంతో ఆయా వార్డుల్లో విజయోత్సలు జరుపుకున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -