Monday, October 6, 2025
E-PAPER
Homeజాతీయంబలంగా దేశ ఆర్థిక వ్యవస్థ

బలంగా దేశ ఆర్థిక వ్యవస్థ

- Advertisement -

ద్రవ్యోల్బణం తగ్గుముఖం..
ఎగుమతుల్లో పెరుగుదల
‘ఆపరేషన్‌ సిందూర్‌’తో గుణపాఠం : రాష్ట్రపతి ముర్ము
న్యూఢిల్లీ:
స్వావలంబన దేశంగా అవత రించే దిశగా భారత్‌ దృఢమైన విశ్వాసంతో ముందుకు సాగుతోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ద్రవ్యో ల్బణం తగ్గు ముఖం పట్టిందని, ఎగుమతులు పెరిగాయని,అన్ని కీలక సూచీలు దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని చూపిస్తున్నాయని తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించు కుని రాష్ట్రపతి ముర్ము జాతినుద్దేశించి ఈమేరకు ప్రసంగించారు. పహల్గాం లో అమాయక పౌరులపై జరిగిన ఉగ్రదాడిని అమానుషమైన, పిరికిపంద చర్యగా పేర్కొన్నారు. ఉగ్రవాదంపై మానవాళి పోరాటంలో ‘ఆపరేషన్‌ సిందూర్‌ ‘ ఒక ఉదాహరణగా చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు.
”పహల్గాం ఉగ్రదాడిని దేశమంతా ముక్తకంఠంతో ఖండించింది. మనల్ని విభజించాలనుకునే వారికి దీటైన జవాబు ఇచ్చింది. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ద్వారా ఉగ్రమూకలకు గుణపాఠం నేర్పింది. దేశాన్ని కాపాడే విషయంలో మన సాయుధ బలగాలు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయని ఈ ఆపరేషన్‌ చాటింది. సుపరిపాలన, అవినీతిని సహించని విధానాలతో భవిష్యత్తు దిశగా దేశం పయనిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం జీడీపీ వృద్ధి రేటుతో.. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. కాశ్మీర్‌ లోయలో రైలు మార్గంతో స్థానికంగా వాణిజ్యం, పర్యాటకం మరింత మెరుగుపడతాయి” అని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -