Tuesday, October 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ మారణహోమాన్ని తీవ్రంగా వ్యతిరేకించండి!

పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ మారణహోమాన్ని తీవ్రంగా వ్యతిరేకించండి!

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
అమెరికా మద్దతుతో ఇజ్రాయిల్ పాలస్తీనా ప్రజలపై కొనసాగిస్తున్న మారణ హోమాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, పాలస్తీనా ప్రజా పోరాటానికి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ మద్దతు తెలుపుతూ మంగళవారం  నందిపేట్ మండలంలోని వెల్మల్ గ్రామంలో సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో పాలస్తీనా ప్రజలకు సంఘీభావ ప్రదర్శన నిర్వహించినట్లు న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాల నుండి ఇజ్రాయిల్ అమెరికా మద్దతుతో పాలస్తీనా జాతి ప్రజలని నిర్మూలించే కుట్ర చేస్తుందని ఆయన అన్నారు. 

గాజాపై దుర్మార్గపు దాడి కొనసాగిస్తుందని ఆయన తెలిపారు. ప్రపంచ శాంతి వల్లించే అమెరికా తమ స్వార్థం కోసం ఇజ్రాయిల్ దేశాన్ని 1948 తర్వాత సృష్టించి, పాలస్తీనా ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుందని ఆయన తెలిపారు. భారత ప్రభుత్వం పాలస్తీనా ప్రజలకు మద్దతు తెలిపాలని, ప్రజాస్వామ్య రక్షణకు కృషి చేయాలని దాసు భారత ప్రభుత్వాన్ని కోరారు. ఇజ్రా యిల్ ఆధర్మ దాడిలో 60వేల పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, ప్రజలు జీవించే హక్కును హరించే హక్కు అమెరికాకు ఎవడిచ్చాడని ఆయన ప్రశ్నించారు. ప్రపంచంలో ఆదర్శమైన ప్రజాస్వామ్య దేశమంటూ గొంతు చించుకునే అమెరికా నేడు పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల అంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకొని, తన మార్కెట్ ఆదిపత్యం కోసం దాడుల్ని కొనసాగిస్తుందని దాసు తెలిపారు. పాలస్తీనా ప్రజల ప్రతిఘటన పోరాటం జయప్రదం కావాలని, వారి పోరాటానికి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ సంపూర్ణ మద్దతును తెలియజేస్తుందని  తెలిపారు. 

ఈ కార్యక్రమంలో నందిపేట్ సబ్ డివిజన్ కార్యదర్శి అబ్దుల్ న్యూ డెమోక్రసీ నాయకులు దేవన్న, ప్రజా సంఘాల నాయకులు పోశెట్టి, దొనపల్లి లింగన్న, బాజన్న, గంగారం, ఆశీర్వాదం,,తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -