నవతెలంగాణ – జుక్కల్: జుక్కల్ మండలంలో పలు గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా కొనసాగుతున్నాయని జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ , ఎంపీ ఓ రాము తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని బస్వాపూర్ గ్రామానికి సందర్శించి న జుక్కల్ ఎంపిడిఓ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులకు పలు సూచనలు చేసి నూతనంగా నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇండ్లకు మార్కౌట్ చేసి స్థానిక పంచాయతీ కార్యదర్శి భరద్వాజ్ తో కలిసి మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల పనులను ప్రారంభించారు . అదేవిధంగా మండలంలోని కేమ్రాజ్ కల్లాలి గ్రామంలో జుక్కల్ ఎంపీ ఓ రాము నూతనంగా మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇంటి స్థలాలను పరిశీలించి నిర్మించుకోవడానికి వారికి ముగ్గు వేసి పనులను స్థానిక గ్రామపంచాయతీ ఇంచార్జ్ కార్యదర్శి జీవన్ రాథోడ్ తో కలిసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో , ఎంపీవో మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణాలు చేపట్టాలని నిర్మాణాలు పెద్దగా నిర్మించిన పూర్తిగా చిన్నగా నిర్మించిన వాటికి డబ్బులు మంజూరు చేయడం జరగదని నిర్దేశించిన కొలతల ప్రకారం ఇంటి నిర్మాణాలు చేపట్టాలని లబ్ధిదారులకు సూచించారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు నాలుగు విడతలుగా డబ్బులు వారి ఖాతాలు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు , ఎంపీడీవో, ఎంపీ ఓ , ఆయా గ్రామాల గ్రామపంచాయతీ కార్యదర్శులు , ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు , తదితరులు పాల్గొన్నారు .
పుంజుకున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES