జగ్జీవన్‌రామ్ స్ఫూర్తి
కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అట్టడుగు వర్గాల కోసం పనిచేసిన జగ్జీవన్‌రామ్ స్ఫూర్తితో రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యల పరిషారం కోసం పోరాడాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు అన్నారు. ఆదివారం బషీర్‌బాగ్ లోని జగ్జీవన్ రామ్ విగ్రహానికి ఆయన పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలుకు నోచుకోవడం లేదని తెలిపారు.
దళిత బంధు స్థానంలో అంబేద్కర్ అభయహస్తం ప్రకటించిన ప్రభుత్వం దాన్ని ఎందుకు అటకెక్కించిందో చెప్పాలని నిలదీశారు. ప్రభుత్వం దళితులకిచ్చిన ఏ ఒక్క వాగ్దానం అమలు చేయటం లేదని తెలిపారు. 2026- 27 బడ్జెట్‌లో దళితుల సంక్షేమానికి భారీ కోతలు విధించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో 143 కుల దురహంకార హత్యలు జరిగాయని తెలిపారు. ఇప్పటికైనా కులాంతర వివాహాలకు రక్షణ కల్పిస్తూ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ హైదరాబాద్ నగర కార్యదర్శి బి సుబ్బారావు, రాములు నగర నాయకులు సోమన్న ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
దళితుల సమస్యలపై పోరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



