ప్రభుత్వ విద్యపై పాలకుల వివక్ష తగదు
రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించాలి : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు శనిగరపు రజనీకాంత్, టి.నాగరాజు
కరీంనగర్ కేంద్రంగా రాష్ట్ర విద్యా వైజ్ఞానిక శిక్షణా తరగతులు ప్రారంభం
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సిద్ధం గా ఉండాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నాయకు లు విద్యార్థులకు పిలుపునిచ్చారు. కరీంనగర్ ముకుంద లాల్ మిశ్రా భవన్‌లో మంగళ వారం ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు ప్రారంభమ య్యాయి. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రభుత్వ విద్యారంగం రోజురోజుకూ నిర్వీర్యం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా పూర్తి స్థాయి విద్యాశాఖ మంత్రి లేకపోవడం బాధాకరమన్నారు. పాఠశాల ల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు, సరిపడా ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ఐటీఐ అడ్మిషన్లను పునరుద్ధరించాలని రాష్ట్ర అధ్యక్షులు శనిగరపు రజనీకాంత్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఐటీఐలో ప్రవేశాలను నిలిపి వేయడం సరైన పద్ధతి కాదన్నారు.
ఏటీసీలను తీసుకొచ్చి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామనే పేరుతో సంప్రదాయ ట్రేడ్లలో అడ్మిషన్లను నిర్లక్ష్యం చేయడం సరికాదని చెప్పారు. రూ.8,700 కోట్లకు పైగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రూ.600 కోట్లు మాత్రమే విడుదల చేస్తామని హామీ ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థుల పట్ల ఉన్న చిత్తశుద్ధిని చెబుతోందన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ మాజీ నాయకులు మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. యువత మతోన్మాదానికి వ్యతి రేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఎస్‌ఎఫ్‌ఐ దేశంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘమని, విద్యారంగ సమస్యలపై పోరాటాలు చేస్తున్న ఘనత ఎస్‌ఎఫ్‌ఐదేనని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల్లోనూ కులాలు, మతాలను చొప్పించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. మతోన్మాద రాజకీయాలను అడ్డుకోవాలని, శాస్త్రీయ విద్యా విధానం కోసం రాజీలేని పోరాటాలు చేయాలని పిలు పునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మక్కపెల్లి పూజ, సహాయ కార్యదర్శులు గజ్జెల శ్రీకాంత్, కిరణ్, ప్రశాంత్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్, రాష్ట్ర కమిటీ నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
విద్యారంగ సమస్యలపై పోరాటాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES