– మంత్రి వాకిటి పరామర్శ
నవతెలంగాణ-సిటీబ్యూరో
హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో7వ తరగతి చదువుతున్న విద్యార్థి ఉమేష్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన విషయం తెలుసుకున్న మంత్రి వాకిటి శ్రీహరి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెల్‌నెస్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని ఆదివారంపరామర్శించారు. విద్యార్థికి అందుతున్న చికిత్సను డాక్టర్లను అడిగి తెలుసుకొని, మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.విద్యార్ధ్థి ఆరోగ్యం మెరుగుపడే వరకు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందని హామీ ఇచ్చారు. విద్యార్ధి ఆత్మహత్యా యత్నానికి గల కారణాలపై విచారణ చేయాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డిని ఫోన్‌లో మంత్రి ఆదేశించారు. విద్యార్ధి తల్లిదండ్రులకు భయపడొద్దని ధైర్యం చెప్పారు. పరామర్శించిన వారిలో.. స్పోర్ట్స్ అథారిటీ వీణసోనీ, బాలాదేవి ఇతర అధికారులు ఉన్నారు.
హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



