Friday, January 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మధ్యాహ్న భోజనంతో పెరిగిన విద్యార్థుల హాజరు శాతం

మధ్యాహ్న భోజనంతో పెరిగిన విద్యార్థుల హాజరు శాతం

- Advertisement -

తాడిచెర్ల జూనియర్ కళాశాల ప్రిన్స్ పాల్ విజయదేవి
నవతెలంగాణ – మల్హర్ రావు

మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనంతో విద్యార్థుల సంఖ్య పెరిగిందని కళాశాల ప్రిన్స్ పాల్ విజయదేవి తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఆమె మాట్లాడారు. విద్యార్థుల తల్లిదండ్రులు,దాతల సహకారంతో నవంబర్ 3వ తేదీ నుంచి కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించినట్లుగా చెప్పారు. అంతకుముందు విద్యార్థులు కళాశాలకు వచ్చే సమయానికి ఇంట్లో వంట పూర్తి కాకపోవడం వల్ల చాలామంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయకపోవడంతో చదువుపై కొంత ఏకగ్రత కోల్పోయేవారని దీంతో విద్యార్థులు సక్రమంగా కళాశాలకు రాలేక విద్యార్థుల హాజరు శాతం కొంతమేర తగ్గిందన్నారు.

దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని కళాశాలలో ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ అండ్ అధ్యాపకుల మీటింగ్ లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి ఏర్పాటుకు సంబంధించిన విషయాన్ని విద్యార్థుల పేరెంట్స్ కు మీటింగ్ లో తెలియజేసి  దాతల సహకారంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీని ద్వారా  విద్యార్థులు హాజరు శాతం పెరిగి అలానే సాయంత్రం స్టడీ అవర్ వరకు కూడా అందరు విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారని తెలిపారు. ఈ మధ్యాహ్న భోజనం వార్షిక పరీక్షల వరకు కూడా అందిస్తామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -