Tuesday, July 22, 2025
E-PAPER
Homeక్రైమ్వొక్సన్‌ యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య

వొక్సన్‌ యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -

– అఘాయిత్యానికి ముందు సెల్ఫీ వీడియో..
నవతెలంగాణ-మునిపల్లి

బీటెక్‌ విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని కంకోల్‌ వద్దనున్న వొక్సన్‌ యూనివర్సిటీలో జరిగింది. స్థానిక ఎస్‌ఐ రాజేష్‌ నాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సరూర్‌నగర్‌కు చెందిన గున్నా ఋషికేశ్‌ రెడ్డి వొక్సన్‌ విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్‌ విభాగంలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. అయితే ఈనెల 19న స్నేహితులు ముగ్గురితో కలిసి అద్దె కారు తీసుకుని కొండపోచమ్మ ఆలయానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో అద్దె వాహనానికి స్వల్ప డ్యామేజ్‌ జరిగింది. దాంతో అద్దె వాహన యజమాని రూ.25 వేలు నష్టపరిహారంగా చెల్లించాలని కోరగా.. అప్పటికప్పుడు అతడి తల్లి రూ.5000 చెల్లించింది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం నాలుగున్నర ప్రాంతంలో హాస్టల్‌ గదిలో విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఋషికేశ్‌రెడ్డి సెల్ఫీ వీడియో తీసుకుని ‘నాకు ఎవరూ లేరని, సారి అమ్మ అని, ఐ లవ్‌ యూ అక్క(అద్వైత)’ అంటూ వీడియో చిత్రీకరించాడు. కాగా, తన కుమారుని మృతిపై అనుమానం ఉన్నదని మృతుని తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -