Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుsuicide attempt: కొత్తపేట మెట్రో స్టేషన్ పై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

suicide attempt: కొత్తపేట మెట్రో స్టేషన్ పై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: జేఈఈ పరీక్షలో క్వాలిఫై అవ్వలేదని ఓ విద్యార్థి ఎల్బీనగర్ కొత్తపేటలోని విక్టీరియా మెట్రో స్టేషన్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ లోని మీర్ పేటకి చెందిన హర్షిత్ గత కొన్ని రోజులుగా జేఈఈ పరీక్షలో క్వాలిఫై అవ్వలేదని డిప్రెషన్ లో ఉన్నాడు. శుక్రవారం కోచింగ్ కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటికి వచ్చిన అతను.. మధ్యాహ్నం తన తల్లికి ఫోన్ చేసి డిప్రెషన్ నుంచి బయటపడలేకపోతున్నా అంటూ మాట్లాడాడు. అనంతరం విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img